కన్న కొడుకులకు.. భారమైన వృద్ధ తల్లిదండ్రులు..!?
మెదక్ మార్చి 10(ప్రజాక్షేత్రం): వయస్సు మీద పడి చివరి అంకంలో ఉన్న తల్లిదండ్రులకు పుట బువ్వ పెట్టాని పుత్రుల నిర్వాకం ఇది.. డెబ్బై ఏళ్లు దాటి.. ఇద్దరు కుమారులు చేర దీయకపోవడంతో పస్తులతో ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేసిన ఉదంతం సోమవారం చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ కు చెందిన దేశి కొమురయ్య, శివ లక్ష్మి లకు సత్యనారాయణ, కాశీనాథ్ం ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక కుమారుడు హైదరాబాద్ లో నివాసం ఉంటుండగా మరో కుమారుడు వెల్దుర్తిలో వ్యాపారం చేస్తున్నాడు. తల్లిదండ్రుల కృషితో అర్థికగా బాగానే ఉన్నా, వృద్ధాప్యం లో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదని స్వయంగా తల్లిదండ్రులు మెదక్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. భోజన వసతి తో పాటు బాగోగులు చూసుకుంటే చాలని వారు విన్నవించుకున్నారు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కంటి రెప్పల చూసుకోవాల్సిన పుత్రులు వారిని పట్టించుకోకుండా వదిలేయడం పై చూసిన వారంతా అయ్యో అంటూ జాలి పడ్డారు. ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ బాధిత తల్లిదండ్రులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని ఆదేశించారు.