Praja Kshetram
తెలంగాణ

ఏసీబీకి పట్టుబడిన మెదక్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

ఏసీబీకి పట్టుబడిన మెదక్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

 

 

మెదక్ మార్చి 11(ప్రజాక్షేత్రం):అవినీతి నిరోధక బ్యూరో వలకి మరో అవినీతి అధికారి చిక్కారు. రూ.12 వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వలకి చిక్కారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా  పని చేస్తున్న జానయ్య మ్యుటేషన్ కోసం వచ్చిన బాధితుని నుంచి లంచం డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో బాధితుడు మెదక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్లానింగ్ ప్రకారం బాధితుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్యకు రూ.12 వేలు ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జానయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగిస్తున్నాయి.

Related posts