Praja Kshetram
తెలంగాణ

బేడీలు వేసి వెట్టిచాకిరి.

బేడీలు వేసి వెట్టిచాకిరి.

-నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్​స్టేషన్​లో ఓ యువకుడిపై పోలీసుల పైశాచికత్వం.

-కాళ్లకు సంకెళ్లు వేసి మరీ వెట్టిచాకిరి చేయించిన ఖాకీలు.

– సోషల్ మీడియాలో వైరల్​గా మారిన వీడియోలు.

నిజామాబాద్ మార్చి 11(ప్రజాక్షేత్రం):బైక్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ యువకుడిపై ఖాకీలు పైశాచికత్వం ప్రదర్శించారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పోలీస్ స్టేషన్​లో కాళ్లకు బేడీలు వేసి బంధించి వెట్టిచాకిరి చేయించిన అమానుష ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ యువకుడి చేత తాను కూర్చున్న స్థలాన్ని ఓ పోలీసు ఉడిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

– కమిషనర్ సీరియస్

కాళ్లకు సంకెళ్లు వేసి పోలీస్​స్టేషన్​లో చీపురుతో ఊడిపించడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. దీనిపై జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య సీరియస్ అయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది

Related posts