అసెంబ్లీ లాబీలో కేసీఆర్ను కలిసిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
– గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్లో చేరిన మహిపాల్ రెడ్డి
– కేసీఆర్ను కలవడంతో ప్రాధాన్యత
– తన తమ్ముడి కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు మార్చి 12(ప్రజాక్షేత్రం):తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పటాన్చెరు శాసన సభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. మహిపాల్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ను ఆయన కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని ఆయన బీఆర్ఎస్ పార్టీ అధినేతకు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. గూడెం మహిపాల్ రెడ్డి 2014, 2019, 2023లలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నుండి విజయం సాధించారు. గత ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనధికారికంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ, పటాన్చెరులోని తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫొటోను పెట్టుకున్నారు.