కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్తో పూర్తిగా అబద్దాలు చెప్పించింది : బిజెపి ఎమ్మెల్యేలు
తెలంగాణ బ్యూరో మార్చి 12(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ప్రభుత్వం సభలో గవర్నర్ తో అబద్ధాలు చెప్పించి, చేయని రైతు రుణ మాఫీ చేసినట్లు పూర్తిగా అబద్ధాలు చెప్పించారని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్ పేర్కొన్నారు. అదే విధంగా మహిళా సోదరీమణులను కొటీశ్వరులను చేశామని ఊహకందని అవాస్తవాలు చెప్పారని, 317 జి.ఓతో ఉద్యోగులు బాధపడుతున్నారని, దానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వక పోవడం దారుణమన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు కన్నీరు కారుస్తున్నారని, వారి ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలుచేపట్టబోతుందో అంశాలను కూడా ఎక్కడ చెప్పలేదని, ఈప్రభుత్వం రైతులపై ప్రేమ లేదని, ఇప్పటివరకు రైతు భరోసా మూడు ఎకరాల వరకు కూడా సక్రమంగా ఇవ్వలేదని మండిపడ్డారు. తప్పడు ప్రసంగాలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు ఈప్రభుత్వం చేస్తోందని వారి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో గుణపాఠం చెప్పక తప్పదన్నారు.
తులం బంగారం, ఆడ పిల్లలకు స్కూటీ ఎంతమందికి ఇచ్చారు : దన్పాల్ సూర్యనారాయణ
సభలో ఎప్పడు ఇలాంటి అబద్ధాలు గవర్నర్ తో ఏప్రభుత్వం చెప్పించలేదని, తులం బంగారం, స్కూటీలు, నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తప్ప ఏమి చేయలేదు. అయిన ఆర్టీసీకి నెలవారీగా ఇవ్వాల్సిన నగదు ఇవ్వడం లేదని, కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా పాత బస్సులో కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు విస్మరించి గవర్నర్ ప్రసంగంలో అమలు చేస్తున్నట్లు పేర్కొనడం ఇంతకు మించిన దారుణం మరోకటి ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలో కలగంటున్నది తప్ప పథకాల, ఇచ్చిన హామీల అమలు చేయకుండా తప్పించుకుంటుందని మండిపడ్డారు.
గవర్నర్ తో అబద్ధాలు చెప్పించడం చాలా బాధాకరం : రామారావు పటేల్
రేవంత్ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా అవాస్తవాలు గవర్నర్లో చెప్పించడం బాధకరమని ఎమ్మెల్యే రామారావు పటేల్ విమర్శించారు. అన్నదాతలకు ఎంతో ఆర్భాటంగా ఇచ్చిన హామీలో ఒకటైన రైతు రుణ మాఫీ పూర్తిగా జరుగలేదు. ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కోసం వ్యవసాయశాఖ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, ఎప్పడు మాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకా రైతు భరోసా గురించి పట్టించుకోవడం లేదని, యాసంగి సీజన్ముగిసిన రైతుల ఖాతాలో నగదు జమ చేసే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించి పేదలకు అప్పగించాలని, గత ప్రభుత్వం తరహాలో ఇచ్చిన మాట విస్మరిస్తే జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. ఈనెల 27 వరకు జరిగే సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.