Praja Kshetram
తెలంగాణ

అజిజ్ నగర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి

అజిజ్ నగర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి.

 

– ఎమ్మార్వో ఆఫీస్ ముందు సీపీఎం ధర్నా.

మొయినాబాద్ మార్చి 12(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ ఎమ్మార్వో కార్యాలయం ముందు అజిత్ నగర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని ధర్నా నిర్వహించి, డిప్యూటీ ఎమ్మార్వో కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్ హాజరై మాట్లాడుతూ అజిజ్ నగర్ రెవెన్యూ పరిధిలోని డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదల కోసం నిర్మించారని పేదలకు ఇవ్వడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇది సరి అయింది కాదన్నారు స్థానిక ఎమ్మార్వో ప్రత్యేక చొరవ తీసుకొని విద్యుత్ సప్లై, మంచినీటి సదుపాయం కల్పించాలని అన్నారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా జాప్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మొయినాబాద్ మండల కన్వీనర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్, సిపిఎం చేవెళ్ల డివిజన్ కమిటీ సభ్యులు ప్రభుదాస్, అరుణ్ కుమార్, శ్రీనివాస్, ట్రాన్స్పోర్ట్ యూనియన్ సిఐటియు మొయినాబాద్ మండల అధ్యక్షులు గోపాల్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Related posts