చింతలపూడి నగర పంచాయతీలో ఉన్న చెరువుల విస్తీర్ణం సర్వే చేయించి సరిహద్దులను గుర్తించాలి.
– చింతలపూడి పట్టణ కమిటీ సిపిఐ డిమాండ్
ఏలూరు జిల్లా మార్చి 12 (ప్రజాక్షేత్రం):చింతలపూడి నగర పంచాయతీలో ఉన్న చెరువుల విస్తీర్ణం సర్వే చేయించి సిపిఐ చింతలపూడి కమిటీ డిమాండ్ సరిహద్దు లను గుర్తించి ఆక్రమణ లను తొలగింపునకు చర్యలు గైకొనాలి సిపిఐ చింతలపూడి పట్టణ కమిటీ డిమాండ్. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో 21 చెరువులు ఉన్నాయని అవి చింతలపూడి పెద్ద చెరువు మొహిద్దిన్ కుంట మాదిగ చెరువు పేరంరాజు కుంట మాదాపుకుంట రాళ్ల కుంట బోయగూడం పెద్ద చెరువు వేగి లింగేశ్వర స్వామి చెరువు కోమటికుంట విభూది కుంట రంగన్న కుంట సింగరాజు కుంట రావులకుంట కృష్ణ రాయుడు కుంట రామికుంట తాడిబంధం చెరువు కోపులకుంట కముజుల బంధం చెరువు కొత్తచెరువు ఈడిగాడి చెరువు అయ్యగారు కుంట వీటిలో మూడు కుంటలు పూర్తిగా మాయమయ్యాయని చింతలపూడి పెద్ద చెరువు బోయ గూడెం పెద్ద చెరువు వేగే లింగేశ్వర స్వామి చెరువు మొహిద్దిన్ కుంట ఆక్రమించబడి బిల్డింగులు కట్టబడ్డాయని ఇంకా భవన నిర్మాణాలు జరుగుతున్నాయని మిగిలిన చెరువులు సైతం ఆక్రమించబడి సాగుభూములుగా మారుతున్నాయని ఆర్ఎస్ఆర్ ప్రకారం 21 చెరువుల విస్తీర్ణం సర్వే చేయించి సరిహద్దులను గుర్తించి ఆక్రమాల తొలగింపునకు చర్యలు తీసుకోగలరని చింతలపూడి కమిషనర్ పీ పావనికి చింతలపూడి భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కమిటీ వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు మాట్లాడుతూ చెరువులు కుంటల సంరక్షణ వలన చెరువులు కుంటలలో నీరు నిల్వ ఉండడంతో పాటు భూగర్భ జల ప్రమాణాలు పడిపోకుండా ఉంటాయని వేసవి పశుపక్షాదులకు త్రాగునీరు లభిస్తుందని అంతేగాక వరద నష్టాలు రావని భూతాపం వడగలుపుల నుండి ప్రజలు సేద తీరుతారని పర్యావరణ ప్రాముఖ్యత దృష్ట్యా భవిష్యత్ తరాల కోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు చెరువులు కుంటలు సంరక్షణ ఎంతైనా ఉందని అందువలన చెరువులు కుంటల సంరక్షణకు చర్యలు గైకొనాలని అట్లా గైకొనని పక్షంలో సిపిఐ ప్రత్యక్ష ఆందోళనలకు కూడా సిద్ధమవుతుందని తెలిపారు వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఐ మండల కమిటీ సభ్యులు దంతా కృష్ణ పట్టణ నాయకులు ఎస్కే కాలేషా తాడిగడప మాణిక్యాలరావు మోర్తా లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.