Praja Kshetram
తెలంగాణ

‘శ్రీచైతన్య’పై కొనసాగుతున్న ఐటీ సోదాలు

‘శ్రీచైతన్య’పై కొనసాగుతున్న ఐటీ సోదాలు

 

ఖమ్మం అర్బన్‌ మార్చి 13(ప్రజాక్షేత్రం): ఖమ్మం నగరంలోని శ్రీచైతన్య విద్యాసంస్థలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. అధికారులు విద్యార్థుల ఫీజులకు సంబంధించిన రసీదులు, విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించిన ఆడిటర్లను ప్రశ్నించి, ట్యాక్స్‌ చెల్లింపునకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సోదాలు జరుగుతున్న కళాశాలలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు జరుగుతుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.

Related posts