Praja Kshetram
తెలంగాణ

మొకిల కేకే ఫుడ్ కోర్ట్ లో అపశ్రుతి – బిర్యానీలో ఈగలు!

మొకిల కేకే ఫుడ్ కోర్ట్ లో అపశ్రుతి – బిర్యానీలో ఈగలు!

 

-విచ్చలవిడిగా, అక్రమంగా మద్యం అమ్మకాలు, పట్టించుకోని అధికారులు.

-పరిశుభ్రత పాటించని రెస్టారెంట్ లాపై చర్యలు తీసుకోవాలి.

శంకర్‌పల్లి, మార్చి 15(ప్రజాక్షేత్రం):శంకర్‌ పల్లి మండల పరిధిలోని మొకిలలో ఉన్న కె కె ఫుడ్ కోర్టు రెస్టారెంట్‌లో ఆహార ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. కొండకల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆ రెస్టారెంట్ నుండి హోం డెలివరీ ద్వారా బిర్యాని ఆర్డర్ చేసుకొని తినే సమయంలో అందులో ఈగలు కనిపించాయని ఆరోపించారు. ఈ ఘటనతో యువకుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పరిశుభ్రత పాటించని రెస్టారెంట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. స్థానికులు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా కె కె ఫుడ్ కోర్టు లో అక్రమంగా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కేకే ఫుడ్ కోర్ట్ ఇన్చార్జి రాజు (పేరు మార్పు ముస్లిం వ్యక్తి) ఆధ్వర్యంలో అనేక గొడవలకు, కారకుడు అయ్యాడు. తనకు నచ్చని పార్టీ వాళ్లు ఎవరైనా వస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించడం, వారిపైన గొడవలకు ప్రేరేపించడం ఇన్చార్జి నైజం. ఇకనైనా అధికారులు చర్య తీసుకొని ఆ డాబాను మూసివేయాల్సిందిగా ప్రజలు కోరుచున్నారు.

Related posts