పల్లెల్లో జనాభా ఎక్కువ అయింది, ఉపాధికి పనికి దూరమైంది.
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 15 (ప్రజాక్షేత్రం):గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వలసలు వెళ్లకుండా నిరోధించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీం కింద కనీసం వంద రోజులకు కూలీలకు ఉపాధి కల్పిస్తారు. అలాగే జాబ్ కార్డు కలిగి ఉండి 20 రోజులు పని చేసిన వారికి ఏడాదికి రూపాయలు 12000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. అయితే మున్సిపాలిటీలు వాటిల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమల్లో లేకపోవడంతో అక్కడ జీవిస్తున్న కూలీలు పనులకు దూరం కావడమే కాకుండా ఆత్మీయ భరోసా కు నోచుకో పోవడం లేదు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొత్తూరు, అమంగల్, షాద్ నగర్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి తదితర మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోవడంతో ప్రభుత్వం స్పందించి తమకు పని కల్పించాలని కూలీలు ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో సగానికి పైగా పట్టణ ప్రాంతాలు ఉండడంతో అవి మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, మొయినాబాద్, తదితర మున్సిపాలిటీలు వాటిలో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం, అమల్లో లేకపోవడంతో అక్కడ జీవిస్తున్న కూలీలు పనులు దొరక్క ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా పథకానికి అర్హులు కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో గతంలో 14 మున్సిపాలిటీలు ఉండగా కొత్తగా చేవెళ్ల, మొయినాబాద్, లను కూడా పురపారపాలికలుగా ప్రభుత్వం ప్రకటించడంతో వార్డు సంఖ్య 16 కు చేరింది. అదేవిధంగా 21 మండలాలు ఉండగా అందులో సగం వరకు మున్సిపాలిటీల పరిధి విస్తరించి ఉన్నది, దీంతో గ్రామీణ ప్రాంతాలు మున్సిపాలిటీలుగా అవతారం ఎత్తడంతో వాటిని కూడా పట్టణ ప్రాంతాలు గానే పరిగణిస్తున్నారు. అలాగే ప్రస్తుతం జిల్లాలో మూడు కార్పొరేషన్లు ఉన్నాయి వాటిలోనూ ఉపాధి హామీ పథకం నిలిచిపోయింది, నూతనంగా మరో 20 గ్రామపంచాయతీలను కలుపుతూ ఫ్యూచర్స్ సిటీగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది ఈ కార్పొరేషన్ ఏర్పాటు అయితే మరో 20 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోతున్నది జిల్లాలో 549 గ్రామపంచాయఉండగా ఇటీవల సుమారు 30 పంచాయతీలు మున్సిపాల్టీల పరిధిలో చేరిపోయి ఈ గ్రామాల్లోని కూలీలు ఉపాధి హామీ పనులతో పాటు ఆత్మీయ భరోసా పథకానికి దూరం కానున్నారు. ఇటీవల మున్సిపాలిటీలోనూ పేదలు ఉన్నారని వారికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉపాధి కల్పిస్తారు, అలాగే జాబ్ కార్డు కలిగి ఉండి 20 రోజులు పని చేసిన వారికి ఏడాదికి రూ 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామ రేవంత్ సర్కార్ ప్రకటించింది. అయితే మున్సిపాలిటీలు, వాటిలో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమల్లో లేకపోవడంతో అక్కడ జీవిస్తున్న కూలీలు పనులకు దూరం కావడమే కాకుండా ఆత్మీయ భరోసా కు , నోచుకోవడం లేదు జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొత్తూర్, ఆమనగల్ షాద్ నగర్, చేవెళ్ల, మొయినాబాద్, తదితర మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోవడంతో పని లేక ఇబ్బంది పడుతున్నాం మని ప్రభుత్వం స్పందించి తమకు పని కనిపించాలని కూలీలు ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో సగానికి పైగా పట్టణ పట్టణ ప్రాంతాలు ఉండడంతో అవి మున్సిపాలిటీలుగా అవతరించాయి, ఇబ్రహీంపట్నం, శంకర్ పల్లి, చేవెళ్ల, మొయినాబాద్ తదితర మున్సిపాలిటీలు వాటిలో విలీనమైన గ్రమాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోవడంతో పని లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం స్పందించి తమకు పని పని కల్పించాలని కూలీలు ప్రజలు కోరుతున్నారు. అక్కడ జీవిస్తున్న కూలీలు పనులు దొరక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులు కాగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో గతంలో 14 మున్సిపాలిటీలు ఉండగా కొత్తగా చేవెళ్ల, మొయినాబాద్, లను కూడా పురపాలక సంఘం ప్రభుత్వం ప్రకటించడంతో వార్డు సంఖ్య 16 కు చేరింది. అదేవిధంగా 21 మండలాలు ఉండగా, ఇందులో సగం వరకు మున్సిపాలిటీల పరిధి విస్తరించి విస్తరించి ఉన్నది, దీంతో గ్రామీణ ప్రాంతాలు మున్సిపాలిటీలుగా అవతరించడంతో వాటిని కూడా పట్టణ ప్రాంతాలకే పరిగణిస్తున్నారు. అలాగే ప్రస్తుతము జిల్లాలో రెండు కార్పొరేషన్లు ఉన్నాయి వాటిలోనూ ఉపాధి హామీ పథకం నిలిచిపోయింది, నూతనంగా మరో 20 గ్రామపంచాయతీలను కలుపుతూ ఫ్యూచర్ సిటీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ కార్పొరేషన్ ఏర్పాటయితే మరో 20 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోనున్నది, ఇటీవల మరో 30 పంచాయితీలు మున్సిపాలిటీల పరిధిలో చేరిపోయాయి, ఈ గ్రామాల్లోని కూలీలు ఉపాధి హామీ పనులతో పాటు ఆత్మీయ భరోసా పథకానికి దూరం కానున్నారు, వారికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇబ్బందుల్లో కూలీలు, జిల్లాలో ఉన్న 16 మున్సిపాలిటీల్లో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాలు కలిసినవి,, ఆమనగల్, షాద్ నగర్, కొత్తూర్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్ పేట్, తుర్కయంజాల్, మొయినాబాద్, చేవెళ్ల, మున్సిపాలిటీలు,గ్రామీణ ప్రాంతాలతో విలీనమై ఉన్నాయి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలలో శేరిగూడ, ఖానాపూర్, తుర్కయంజాల్, కోహెడ్, బ్రాహ్మణపల్లి, మన్నెగూడ, ఆదిభట్ల, మున్సిపాలిటీలలో మంగళపల్లి, కొంగర, పటేల్ కూడా, రాందాస్ పల్లి, బొంగులూరు, వంటి గ్రామాలు ఉండగా వాటిని మున్సిపాలిటీలలో విలీనం చేశారు. విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమలులో లేదు, అలాగే కొత్తూర్ చేవెళ్ల, మొయినాబాద్, షాద్ నగర్, వంటి మున్సిపాలిటీలను చుట్టూ ఉన్న గ్రామాలతోనే పురపాలికులుగా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఊళ్ళల్లో ఈ ఊళ్ళలోనూ ఉపాధి హామీ పథకం కొనసాగడం లేదు, దీంతో పలు గ్రామాల ప్రజలు తమను మున్సిపాలిటీల్లో కలిపినందుకు సంతోషపడాలా, ఉపాధి హామీ పథకాన్ని కోల్పోయినందుకు బాధపడా లో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.