హైతాబాద్ లో ఆగని అక్రమాలు
– అనుమతి రెండుకు.. నిర్మిస్తోంది ఐదు
– ఎన్ని పత్రికలో వచ్చిన మాకు సంబంధం లేదు.
– అక్రమ నిర్మాణాలకు అడ్డు ఎవరు?
– అక్రమ నిర్మాణాలు అయినా కూల్చివేతలు లేవు.
– నోటీసులు కాసుల కోసమేనా?
– పత్తాలేని షాబాద్ మండల టౌన్ ప్లానింగ్ టీం.
షాబాద్, మార్చి 16 (ప్రజాక్షేత్రం):చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం హైతాబాద్ టౌన్ అక్రమం,అనధికారిక, అదనపు అంతస్తుల నిర్మాణాలు జోరందుకున్నాయి. బ్యాంకుల ద్వారా రుణాలు పొందే వారు తప్ప మిగతా వారు మాత్రం అనుమతుల కోసం ముందుకు రావడం లేదు. నాలుగైదు నెలలుగా ఇలాంటివి పెరిగిపోతున్నాయని ఆయా ప్రాంతవాసుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు సహించబోమని అధికారులు చెబుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం ఓట్లు ఎక్కడ కోల్పోతామో అన్న ఉద్దేశంతో కూల్చివేతల జోలికి వెళ్లనివ్వడం లేదు.అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాల జోరు కనిపిస్తోంది. వీటికి తోడు పెంట్‌హౌజ్‌లు విరివిగా నిర్మించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు. హైతాబాద్ కార్యదర్శి తెలిపిన వివరాల వరకు జి ప్లేస్ టూ కి మాత్రమే అనుమతులు ఇచ్చాము వాళ్ళు జి ప్లస్ ఫైవ్ ఎత్తుకు కట్టారు నోటీసులు జారీ చేశాము అని తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోవడంలేదని కార్యదర్శి తెలుపుతున్నారు.. దీనిపై షాబాద్ మండల టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల కనుసైగలోని ఇవన్నీ జరుగుతున్నాయా! నోటీసులు కాసుల కోసమేనా! అక్రమ నిర్మాణాలను అని తెలిసి కూడా చూసి కూడా చూడనట్టు ఉంటున్న అధికారులు అని ఆరోపణలు.
– నోటీసులు కాసుల కోసమేనా?
నిబంధనలకు విరుద్దంగా అనుమతి లేకుండా అక్రమంగా పెద్ద భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు. నోటీసులు జారీ చేశామంటున్న కార్యదర్శి నోటీసులు కాసుల కోసమేనా?.. సామాన్యులు, మధ్యతరగతి వారు నిర్మిస్తున్న చిన్న చిన్న నిర్మాణాలపై షాబాద్ మండల టౌన్ ప్లాన్ అధికారులు ప్రతాపం చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అందినకాడికి దండుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.ఈ సర్కిల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ న్యాయ స్థానం ఆదేశాలు అమలులో ఉన్నా.. అక్రమ నిర్మాణాలు మాత్రం యథావిధిగా సాగుతున్నాయి.అడ్డుకోవాల్సిన సర్కిల్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఎసీపీ,టీపీఎస్, చైన్ మెన్ లు కలెక్షన్లపైనే దృష్టి సారించారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలకు కొంత మంది రాజకీయ నేతలు అండగా నిలుస్తుండడంతో చర్యలు తీసుకునేందుకు సిబ్బంది జంకుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
– ఆన్‌లైన్ అనుమతుల వలనే పెరుగుతున్నాయా?
ఆన్‌లైన్‌లో అనుమతి విధానం అమల్లోకి వచ్చాక నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అనే అంశాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అధికారులపై తీవ్ర ఒత్తిడి లేదా కోర్టు ఉత్తర్వులు వస్తే తప్ప కూల్చివేతల వైపు వెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నిర్మాణాలు తొలగిస్తున్నామని చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలకు అండ ఎవరు? గ్రామ కార్యదర్శి వచ్చి చూసినప్పుడు అక్రమ నిర్మాణాన్ని ఆపేసామని నామమాత్రంగా చెప్పి తర్వాత మళ్లీ కట్టడాలను ప్రారంభిస్తున్నారు అని ఆరోపణలు. డబ్బులు ఉన్న వారికే నా ప్రభుత్వం పని చేసేది మాలాంటి పేద ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే ఒక పేద ప్రజలు అనుమతులు లేకుండా కడితే అప్పటికప్పుడే వచ్చి కూల్చివేస్తారు. మరి ఇక్కడ జరుగుతున్న అక్రమాలను మీ కంటికి కనిపించడం లేదా అధికారులను ప్రశ్నిస్తున్న స్థానికులు.