Praja Kshetram
తెలంగాణ

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: హరీశ్ రావు

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి:హరీశ్ రావు

 

హైదరాబాద్, మార్చి 16(ప్రజాక్షేత్రం):బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్సే జగదీశ్వర్ రెడ్డిని ఏకంపక్షంగా తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ… తాము డాటాను నమ్ముకుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డర్టీని నమ్ముకున్నారని మండిపడ్డారు.  అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా రేవంత్ రెడ్డి ఉన్నారని, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలిపి దేశానికే ఆదర్శంగా నిలిచారని హరీశ్ రావు అన్నారు. అలాంటి నాయకుడిని మార్చురీకి పంపాలని రేవంత్ రెడ్డి అనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పతిపక్షంలో ఉన్న జానారెడ్డిని కేసీఆర్ గౌరవించారని, కానీ నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన మార్చురీ వ్యాఖ్యాలను మార్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారని, కేసీఆర్ కు సీఎం క్షమాపణలు చెప్పాలని హరీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఎల్ఎఆర్ఎస్ ఉచితంగా కట్టాలని కాంగ్రెస్ నేతలు అన్నారని, అధికారంలోకి వచ్చాక ఎల్ఎఆర్ఎస్ కట్టాలని డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారని,  రుణమాఫీపై కూడా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రెండు విడతల్లో బీఆర్ఎస్ పార్టీ రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే అని చెప్పుకోచ్చారు. సంపూర్తి రుణమాఫీ జరిగిందంటే తను ముక్కు నేలకు రాస్తాని హరీశ్ రావు సవాల్ చేశారు. నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం అంతా ప్రధాని మోదీ ప్రసన్నం కోసమే అని ఆరోపించారు. కాంగ్రెస్ ముసుగు వేసుకున్న బీజేపీ వ్యక్తి రేవంత్ అని నిన్న జరిగిన శాసన మండలి సమావేశంలో బయటపడిందని హరీశ్ రావు  వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి మీ పనితనానికి నిదర్శనం అని విమర్శించారు. కేటీఆర్ కుమారుడి గురించి మాట్టాడింది రేవంత్ రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు.

 

 

Related posts