ఉచిత ఆర్మీ శిక్షణ కోరకు దరఖాస్తు చేసుకోవాలి.
– పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
పెద్దపల్లి బ్యూరో, మార్చి 17(ప్రజాక్షేత్రం):అగ్నిపథ్ నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా ఆర్మీ ఉద్యోగం కొరకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ కోసం సెలక్షన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ రాత పరీక్ష నిర్వహించి అర్హత పొందిన అభ్యర్థులకు భోజనం, వసతి తో ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. అగ్నిపథ్ రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు ఈవెంట్స్ కోసం ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశం కేవలం పెద్దపల్లి జిల్లా యువకులకు మాత్రమే ఉంటుందని అన్నారు. అభ్యర్థులు 01 అక్టోబర్ 2004 నుంచి 01 ఏప్రిల్ 2008 మధ్య జన్మించి ఉండాలని అన్నారు. ఆసక్తిగల యువకులు ఆన్ లైన్ లో అగ్నిపథ్ కు దరఖాస్తు చేసుకొని, దరఖాస్తు చేసుకున్న ఫారం తో నేరుగా జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని, వివరాలకు 9440167222, 8333044460, 9573688952 నెంబర్లలో సంప్రదించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.