మిషన్ భగీరథ పైపు లీకేజీ
– వృధాగా పోతున్న నీరు
– గత రెండు నెలలుగా లీకేజీ అవుతున్న స్పందించని అధికారులు.
– కలుషితమైన నీరు తాగడంతో విష జ్వరాల బారిన పడుతున్న ప్రజలు.
– మాజీ ఉపసర్పంచ్ చెట్టు కింది శాంత్ కుమార్ వెల్లడి
బషీరాబాద్ మార్చి 17 (ప్రజాక్షేత్రం):మిషన్ భగీరథ నీరు లీకేజీ అవుతుందని గ్రామ కార్యదర్శి, ఎంపీడీవోలతో మొరపెట్టుకున్న అధికారులు ఎవరు స్పందించడం లేదని మాజీ ఉపసర్పంచ్ చెట్టుకింది శాంత్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని దామర్చేడ్ గ్రామంలో స్కూలు దగ్గర దుకాణం ఉంది.దుకాణం పక్కనే గత రెండు నెలలుగా మిషన్ భగీరథ పైపు పగిలి నీరు లీకేజీ అవుతుంది. అక్కడ ఒక చిన్న గుంత ఏర్పడింది. మిషన్ భగీరథ నీటీని వదిలినప్పుడు ఆ గుంత మొత్తం నిండి,తిరిగి పైప్ లోకి లీకేజి కి గురైన నీరు చేరి కలుషితం అవుతుంది. ఇదిలా ఉండగా అదే నీరు గ్రామంలో చాలా మంది ప్రజలు త్రాగుతున్నారు. కాగా కలుపుతమైన నీరు త్రాగడం వలన విష జ్వరాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అంతేకాదు నీరు కూడా వృధాగా పోవడం జరుగుతుంది. నీటి వృధాను అరికట్టి ఇకనైనా అధికారులు, స్పందించి పైపులైను మరమ్మత్తులు చేయించగలరని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.