Praja Kshetram
తెలంగాణ

ప్రజాక్షేత్రం పత్రిక కథనానికి స్పందన..!

ప్రజాక్షేత్రం పత్రిక కథనానికి స్పందన..!

 

– నీటి విడుదల చేసిన అధికారులు.

– గలగల పారుతున్న కెనాల్ కాలువలు.

– ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు.

– “ప్రజాక్షేత్రం దినపత్రిక”కు కృతజ్ఞతలు తెలిపిన అన్నదాతలు.

పెద్దపల్లి బ్యూరో మార్చి 18(ప్రజాక్షేత్రం):ప్రజాక్షేత్రం దినపత్రికలో వచ్చిన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. మంగళవారం కెనాల్ కాల్వ ద్వారా నీటిని వదిలిపెట్టి రైతులకు అందించారు. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంతో పాటు అడవి శ్రీరాంపూర్ గ్రామాల రైతులకు సాగునీరును అందించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తన సొంత ఖర్చులతో జెసిబిని తెప్పించి కాలువలో పడిన చెత్తాచెదారాన్ని తొలగించారు. పొలాలు ఎండిపోయి ఆందోళనలో ఉన్న రైతులకు కాల్వ ద్వారా సాగునీరు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజాక్షేత్రం లో ఉంటూ చివరి దశకు వచ్చిన పోలాలకు నీరు అందించడంలో ముఖ్యపాత్ర పోషించిన ప్రజాక్షేత్రం దినపత్రికకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts