విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల మాజీ ఉపాధ్యక్షులు గన్నేపాగ నర్సింగ్ రావు.
మొయినాబాద్ మార్చి 19(ప్రజాక్షేత్రం):మండలంలోని చిన్న మంగలారం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏస్ వెంకటయ్య ఆద్వర్యంలో పదవతరగతి విద్యార్థిని,విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ప్యాడ్స్,జామెంట్రి బ్యాక్స్,పెన్నులు ఉచితంగా పంపిణీ చేసిన మొయినాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గన్నేపాగ నర్సింగ్ రావు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతోనే అన్ని రంగాలలో అవకాశాలు ఉన్నాయని ఎంతటి కష్టమైన ఇష్టంగా చదివి మన భవిష్యత్ ను బంగారు బాటల వైపు నడిపించాలని అన్నారు.అంతే కాకుండా కన్న తల్లి దండ్రులకు మరియు మన గ్రామానికి,మంచి పేరుతో పాటు భవిష్యత్ లో సమసమాజ స్థాపనకు మీ వంతు కృషిని అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం,మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,గ్రామ పెద్దలు చైర్మన్ శంకరయ్య, భ్యాగరి రాములు,నాగుల పల్లి రాములు,బట్టు మల్లేష్, కొంగండ్ల యాదయ్యా,బొర్ర శంకర్,మొండి ఆనందం,గ్రామ యువ నాయకులు గడ్డమీది విష్ణు గౌడ్,ఆవిషిపేట ఆంజనేయులు, ప్రొద్దటూరి భిక్షపతి, పులగూర్ల శ్రీకాంత్ రెడ్డి,తలారి రాజు, నడిమింటి రాములు,ఆలూరి రాములు, బట్టు రాంచెందర్,గన్నేపాగ దన్ రాజ్, నడిమింటి రత్నం, గన్నేపాగ ప్రసాద్,నడిమింటి పాండు, వడ్డే గొట్టయ్య,తలారి శ్రీను,నాగులపల్లి శివ శంకర్,త్యామ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.