“ప్రజాక్షేత్రం దినపత్రిక” కథనానికి స్పందన.!
– జెసిబి తో గుంతలను పూడ్చివేయించిన కాంట్రాక్టర్.
– ప్రజాక్షేత్రం దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, గ్రామస్తులు.
ముత్తారం, మార్చి 20(ప్రజాక్షేత్రం):ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామ హైస్కూల్లో బోర్ వేసి పైప్ లైన్ కోసం గుంతలను తవ్వి నిర్లక్ష్యంగా వదిలేసిన కాంట్రాక్టర్ అధికారుల తీరుపై ప్రజాక్షేత్రం దినపత్రికలో బుధవారం ప్రచురితమైన “పైప్ లైన్ తవ్వారు గుంతలు పూడ్చడం మరిచారు” అనే కథనానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ స్పందించారు.గురువారం ఉదయం జెసిబి తీసుకొని వచ్చి గుంతలను పూడ్చారు.కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి సమస్యను పరిష్కారం దిశగా ముందుకు తీసుకువెళ్లిన ప్రజాక్షేత్రం దినపత్రికకు విద్యార్థులతో పాటు అడవి శ్రీరాంపూర్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాక్షేత్రం దినపత్రిక పనిచేస్తుందని గ్రామస్తులు అభినందించారు.