ఓయూలో కొనసాగుతున్నఉద్రికత్త
హైదరాబాద్ మార్చి 20(ప్రజాక్షేత్రం):ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో సభలు, సమావేశాలను, ధర్నాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఓయూలో బంద్ కు ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.అనేక ప్రజా ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలపై ఆంక్షలు విధించడం ప్రభుత్వం నియంతృత్వ విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల స్యయంప్రతిపత్తిని రద్దు చేయాలని చేస్తున్న కుట్రలో భాగంగానే ఆంక్షలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియాలో ఇలాంటి అప్రజాస్వామిక నిషేధాజ్ఞలు, నిర్బంధాలు అమలు కాలేదని.. వెంటనే వివాదస్పద సర్క్యులర్‌ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.