అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు.
-ముత్తారం ఎస్సై గోపతి నరేష్.
-ఖమ్మంపల్లి లో ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
ముత్తారం,మార్చి 21(ప్రజాక్షేత్రం):అక్రమంగా ఇసుక తరలిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపాడు.ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకున్నట్లు తెలిపాడు.పోలీస్ లు శుక్రవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఖమ్మంపల్లి గ్రామ శివారులో పెద్ది లక్ష్మీరాజం అనే వ్యక్తి తన ట్రాక్టర్ లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు.ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు తెలీపాడు.ఎవరైనా అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తే చట్టపరమైన చర్యలతో పాటు వెహికల్ సీజ్ చేయడం జరుగుతుందని ఎస్సై నరేష్ హేచ్చరించాడు.