నదిని తలపిస్తున్న ఫత్తేపూర్ బ్రిడ్జి
– కొద్దిపాటి వర్షానికే నీరు మొత్తం రోడ్డుపైన జామ్.
– తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు.
– నరకం చూస్తున్నామంటున్న ద్విచక్ర వాహనదారులు.
– అధికారులు స్పందించి రహదారి పైన నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలి.
– వాహనదారుల డిమాండ్.
శంకర్ పల్లి మార్చి 22(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి కింద రహదారి మొత్తం నదిని తలపిస్తుంది అంటూ వాహన దారులు, స్థానికులు మండిపడుతున్నారు. కొద్దిపాటి వర్షానికి మీరు మొత్తం రోడ్డుపైన నిల్వ ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు.. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న ఫతేపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రోడ్డు మొత్తం గుంతలు పడటంతో, కొద్దిపాటి వర్షానికే నీరు మొత్తం ఎటు వెళ్లలేక బ్రిడ్జి కిందనే నిల్వ ఉండడంతో, ఎక్కడ గుంతలో రాళ్లు ఉన్నాయో తెలియక వాహనదారులు వాహనాలను తోలాలంటే జంకుతున్నారు. ఇప్పుడే ఈ విధంగా ఉంటే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు పైన నీరు నిల్వ తగు చర్యలు చేపట్టి, వాహన దారులకు, స్థానికులకు విముక్తి కలిగించాలని అధికారులను వేడుకుంటున్నారు.