Praja Kshetram
తెలంగాణ

అకాల వర్షం రైతులకు అపార నష్టం.

అకాల వర్షం రైతులకు అపార నష్టం.

 

ముత్తారం, మార్చి 22(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది.శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వడగండ్ల వానకు పంటచేలు దెబ్బతిన్నాయి.వరితో పాటు మొక్కజొన్న చేలు నేల వాలడంతో అన్నదాతకు తీవ్ర నష్టం జరిగింది.పంటలు చేతికందే దశలో ఆకస్మాత్తుగా కురిసిన వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.అకాల వర్షం తమను నిండా ముంచిందని రైతులు వాపోతున్నారు.ముత్తారం మండల వ్యాప్తంగా రైతులు మేల్ ఫిమేల్ సీడ్ వరి పేట్టడంతో పూత దశలో ఉన్న పంటకు ఈ వర్షం వల్ల దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Related posts