Praja Kshetram
తెలంగాణ

కాలిన చెట్లకి బాధ్యులు ఎవరు?

కాలిన చెట్లకి బాధ్యులు ఎవరు?

– బషీరాబాద్ నుంచి తాండూర్ రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలు అగ్నికి ఆహుతి

– అధికారుల పర్యవేక్షణ లోపం

– ప్రభుత్వం మొక్కలపై చేసినా ఖర్చు వృధా

– అధికారుల నిర్లక్ష్య తీరుపై ప్రజల అసహనం

బషీరాబాద్ మార్చ్ 22 (ప్రజాక్షేత్రం):కాలిన చెట్లకి బాధ్యులు ఎవరు?… బషీరాబాద్ నుంచి తాండూర్ వరకు రోడ్డుకు ఇరువైపున గత ప్రభుత్వం హరితహారం లో భాగంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొక్కలు నాటించింది. కాగా ఈ మొక్కలు రోడ్డుపై వెళ్లే వాహనదారులకు చల్లని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మొక్కలన్ని అగ్నికి ఆహుతి అయినాయి. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధాగా పోయిందని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా అధికారుల నిర్లక్ష్యపు తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ పొలాల్లో ఎండిపోయిన కలుపు మొక్కలను కాల్చుతున్నారు.ఆ అగ్ని రాజుకొని రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలాన్ని దహనం అవుతున్నాయి. అధికారులు రైతులకు ముందస్తుగా పంట పొలాల్లో ఎండిన ముక్కలు దహనం చేసేటప్పుడు తగు సూచనలు సలహాలు ఇవ్వాలని పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు సంభవించకుండా చూడాలని పలువురు కోరుకుంటున్నారు.

Related posts