Praja Kshetram
తెలంగాణ

మంథని పశు వైద్యశాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం.

మంథని పశు వైద్యశాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం.

– డాక్టర్ రారు అటెండర్ అసలే ఉండరు.

– తనిఖీలు లేకనే తాళం వేసి ఉంచుతున్నారు.

– డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రెంకల సురేష్.

మంథని, పెద్దపల్లి, మార్చి 22(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో డాక్టర్ లేక ఇతర సిబ్బంది మరియు అటెండర్ లేక రైతులు,పశు యజమానులు వెనతిరిగి పోతున్నారు.రైతులు,గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగడానికి గొర్రెలు,బర్రెలు సబ్సిడీ మీద అందజేస్తున్న సర్కార్ పశువుల ఆసుపత్రులపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.చాలా ఆసుపత్రుల్లో మందుల కొరత ఉంది.హాస్పిటల్లకు జీవాలను తీసుకెళ్తే డాక్టర్లు మందులు రాసి బయట కొనుక్కోమంటుండడంతో పశువుల యజమానులు,రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి,గోదావరిఖని,మంథనిలో ఏరియా వెటర్నరీ ఆసుపత్రులు ఉండగా ప్రతి కేంద్రానికి ఒక వైద్యాధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.కొన్ని వెటర్నరీ ఆసుపత్రులకు ఇంచార్జ్ డాక్టర్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ప్రతి కేంద్రానికి ఒక వైద్యాధికారి ఉన్నప్పటికీని ఇంటర్నల్ ఏరియాలకు,తండాలకు సరైన పశువైద్యం అందడం లేదు.మొబైల్ పశువైద్యం ఎక్కడ కనబడడం లేదు.అటెండర్ ఉన్నప్పటికీని ఆసుపత్రిని ఊడ్చడం చేయకపోవడం వలన ఆసుపత్రి ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోయి ఆసుపత్రి భవనం కూడా శిథిలావాస్తకు చేరింది.ఆవులకు,బర్రెలకు,మేకలకు,గొర్రెలకు,పెంపుడు కుక్కలకు ఏదైనా సమస్య వచ్చి వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువెళ్తే అక్కడ మందులు ఉండడం లేదు.డాక్టర్ లేని సమయంలో హాస్పటల్ కాంపౌండరే వెటర్నరీ అసిస్టెంట్ అంటూ వైద్యం చేస్తున్నారు.మంథని పరిధిలో జీవాలు ఎక్కువయ్యాయి ఆస్పత్రి సరిగా తెరవక తెరిచిన డాక్టర్ లేకపోవడంతో కాంపౌండరే వైద్యం చేస్తున్నారని పశువులకు ఏదైనా పెద్ద రోగం వస్తే బాగు చేసే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.కావున సంబంధిత అధికారులు మంథని ప్రాంతీయ పశువైద్యశాల పనిచేసే సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి పనిచేయని సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Related posts