రెవెన్యూ శాఖలో భారీగా కొత్త పోస్టులు – ఉత్తర్వులు జారీ –
హైదరాబాద్ మార్చి 22(ప్రజాక్షేత్రం):గ్రామీణ స్థాయిలో పాలనను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనాధికారి పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. మాజీ వీఆర్‌ఏలు, మాజీ వీఆర్ఓల నుంచి ఆప్షన్స్ తీసుకున్న తర్వాత నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. దీనికి కావాల్సిన తదుపరి చర్యలను తీసుకోవాలని రెవెన్యూ శాఖను కోరింది.