Praja Kshetram
తెలంగాణ

కరీంనగర్ కేటీఆర్ పర్యటనలో అపశృతి.

కరీంనగర్, మార్చి23(ప్రజాక్షేత్రం):కరీంనగర్ లో ఆదివారం బీఆర్ఎస్ నేత కేటీఆర్ సభలో అపశృతి చోటు చేసుకుంది.సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు.ఆ ర్యాలీలో కరీంనగర్ లోని కోతి రాంపూర్ కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు బుల్లెట్ వాహనంతో ర్యాలీలో బీభత్సం సృష్టించాడు.బుల్లెట్ బైకును రేస్ చేస్తూ జనం పైకి దూసుకెళ్లాడు.ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పద్మజా అనే కానిస్టేబుల్ పైకి ఎక్కించాడు.దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో పాటు ఆమె కాలు విరిగింది.దీంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది శ్రీకాంత్ ను పట్టుకుని బుల్లెట్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్ పద్మజను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Related posts