వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దు.
– రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుంది.
– వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.
– పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.
పెద్దపల్లి,మార్చి23(ప్రజాక్షేత్రం):ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామంలో,జూలపల్లి మండలంలో కొనరావుపేట,జూలపల్లి గ్రామాలల్లో మరియు పెద్దపల్లి మండలంలోని చీకురాయి,బొజన్నపేట మరియు హనుమంతునిపేట గ్రామాల్లో పర్యటించి ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను అధికారులతో స్థానిక నాయకులతో,రైతులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ అకాల వర్షం ద్వారా పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి మండలంలోని కోనరావుపేట,జూలపల్లి గ్రామాలల్లో,ఎలిగేడు మండలంలోని దూళికట్ట గ్రామంలో మరియు పెద్దపల్లి మండలంలోని బోజన్నపేట,చీకురాయి,హనుమంతునిపేట గ్రామాల రైతుల వరి,మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని తక్షణమే నష్టపోయిన రైతుల పంట పొలాలతో పాటు మొక్కజొన్నను అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తో పాటు వ్యవసాయ శాఖ కమిషనర్ రామకృష్ణా రావు,జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు.గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులు ఎప్పుడు నష్టపోయిన పట్టించుకున్న పాపాన పోలేదని ప్రస్తుతం తాము రైతుల పక్షాన నిలబడి వారిని నష్టపోకుండా కృషి చేస్తున్నామన్నారు.అలాగే రైతులందరికి చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకున్నామని ప్రతి రైతు గుంట భూమి కూడా ఎండిపోకుండా నీరు అందించేందుకు తాను కృషి చేస్తానని ఎట్టి పరిస్థితిలో రైతులు తూములు కాలువ గట్లను ధ్వంసం చేసి నీరును వృధా చేయవద్దని అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని తప్పకుండా ప్రతి రైతుకు నీరును అందించేందుకు సహకరిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు,వ్యవసాయ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.