ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ను కలిసిన మాల మహానాడు నాయకులు
వలిగొండ, మార్చి 23(ప్రజాక్షేత్రం):ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ను ఆదివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మాల మహానాడు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేతో శాలువతో ఘనంగా సన్మానిoచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పల నర్సింగ్ రావు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పెరమండ్ల యాదగిరి, సీనియర్ నాయకులు రాపోలు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.