Praja Kshetram
తెలంగాణ

దామోదర్ గారు దయా చూపండి

దామోదర్ గారు దయా చూపండి

 

– దళితుల ప్రాణాలకు రక్షణ కల్పించండి.

– రియల్టార్ మురళి కృష్ణ ను తక్షణమే అరెస్ట్ చేయాలి.

– మురళి కృష్ణ అధీనం లో ఉన్న రైతుల భూములను వెంటనే వారికీ అప్పాజెప్పాలి.

– బహుజన నాయకులు పల్లె సంజీవయ్య అయన కుమారుడు క్రాంతి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన.

– జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాశపగా ఇమ్మయ్య పంబాల దుర్గాప్రసాద్.

సంగారెడ్డి జిల్లా మార్చి 24(ప్రజాక్షేత్రం):ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం లో ఎస్సీ లకే రక్షణ కరువైంది అని ఇన్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ గత 15 సంత్సరాలుగా గొంగులుర్ గ్రామంలో పెనుకొండ మురళికృష్ణ అనే సినిమానిర్మాత సుమారుగా 40 ఎకరాల భూమిని 6 సంవత్సరాలు కౌలుకు తీసుకొని మునగ తోట వేసి వ్యవసాయం చేస్తు కొన్ని రోజులు కలం గడిపాడు 6 సంవత్సరాల తర్వాత ఆలా వ్యవసాయం చేస్తు కౌలు తీసుకొన్న భూములు సమయం దాటినా సంవత్సరాల తర్వాత ఏదైతే కౌలుకు తీసుకున్న భూమి ఉందొ అది తిరిగి అప్పాజెప్పాలన్న రైతులకు ప్రాణాలు తీస్తా అని బెదిరిస్తూ దీంట్లో భాగంగానే బహుజన నాయకులు పల్లె సంజీవయ్య పై అయన కొడుకు క్రాంతి పైన కత్తులతో దాడి చేసి ఆయన కొడుకుని కిడ్నాప్ చేసి కత్తులతో బెదిరిస్తూ హత్య చేసే ప్రయత్నం చేశారు ఎక్కడో రాయలసీమ ప్రాతం లో జరిగితాయి అని విన్న సంఘటనలను ఇక్కడ చూపిస్తున్నా మురళీకృష్ణ ను వెంటనే స్పందించిన పోలీసుల సహాయం తో బ్రతికి బయట పడ్డాడు ఇలాంటి దుర్మార్గమైన ఆగహిత్యలు ఇంతకు ముందు అనేక సార్లు జరిగాయి మురళీకృష్ణ పైన ఇప్పటికె నాలుగు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నపటికీ ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ అట్రాసిటీ కేసు చేసిన పోలీసులు వెంటనే ఆయనను అరెస్ట్ చేసి పిడి యాక్ట్ నమోదు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో బి ఎస్ పి సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మోహన్. గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్. దేవదాస్. తదితరులు పాల్గొన్నారు

Related posts