ఏప్రిల్ 13 న తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం.
– తెలంగాణ నలుమూలల నుంచి తరలి రండి.
– పోస్టర్ ఆవిష్కరణ.
హైదరాబాద్ మార్చి 24(ప్రజాక్షేత్రం):తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏప్రిల్ 13 న ఉదయం 10 గం. ల నుంచి నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను టి యు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, స్టేట్ జెనరల్ సెక్రటరీ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి, కోశాధికారి చర్చల చంద్రన్న ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య, మహిళా ఉద్యమకారుల వేదిక కోతి మాధవి, విద్యార్ధి ఉద్యమకారుల వేదిక అధ్యక్షులు కంచర్ల భద్రి, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే రాజేంద్ర ప్రసాద్, ఉద్యమ కళాకారుల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డోలక్ యాదగిరి, వేముల యాదగిరి, మార్వాడి సుదర్శన్, బోగే పద్మ పి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ లు సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు మోహన్ బైరాగి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మద్దతుతో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరమ్, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలంగాణ కేబుల్ ఛానల్ రిపోర్టర్స్ అసోసియేషన్, డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్(3/2023) తదితర సంఘాల భాగస్వామ్యం తో జర్నలిస్ట్ సమ్మేళనం కార్యక్రమం ను నిర్వహించడం జరుగుతుందని. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫోటో, వీడియో, డెస్క్ జర్నలిస్ట్ లు పాల్గొని ఈ సమ్మేళనం విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
