ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది : ఆశీర్వాదం
శంకర్ పల్లి మార్చి 25(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. సోదర భావాన్ని పెంపోందిస్తుంది అని ఎంఈఎఫ్ సలహాదారుడు ఆశీర్వాదం అన్నారు. మంగళవారం శంకర్ పల్లి లో ముస్లిం ఉపాధ్యాయులు ఎంఈఓ అక్బర్, సలీం పాషా, ఆరీఫ్, ఆశ్రఫ్ ఖాన్, తహర్, రియాజ్ లకు ఎంఈఎఫ్ పక్షాన ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ ఆనాటి నుండి మాదిగలు, ముస్లిమ్ లు సోదరాభావం తో అన్నదమ్ముళ్లగా కలిసి ఉన్నామని హిందూ ముస్లిమ్ పండుగలను కలిసి మెలిసి చేసుకునే వాళ్ళమని యంఈఎఫ్ సోదరులు మాకు అతీద్యం ఇవ్వడం ఆనంద దయాకమని అన్నారు. ఈ కార్యక్రమం ఎంఈఎఫ్ మండలం అధ్యక్షులు జామ కుషాల్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి కిష్టయ్య, ప్రధానోపాధ్యాయులు గోపాల్, లక్ష్మయ్య, సలహాదారులు అశోక్ కానిస్టేబుల్, జంగయ్య, లక్ష్మణ్, పర్మన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.