పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతి
రాజమండ్రి మార్చి 25(ప్రజాక్షేత్రం):కల్వరిలో క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాస్టర్ ప్రవీణ్ ఈరోజు కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా మృతి చెందారు. అయితే తనకి ప్రాణహాని ఉందని ప్రవీణ్ నెల క్రితమే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనది హత్య లేక.. అనుకోని ప్రమాద సంఘటనలో మృతి చెందారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన మృతదేహాన్ని పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతల నెలకొంది. క్రైస్తవ ఆరాధకులు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుండి ప్రమాద స్థలం వరకు ప్రవీణ్ ప్రయాణానికి సంబంధించి మొత్తం సిసిటివి ఫుటేజ్‌ని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పాస్టర్ ప్రవీణ్ మృతికి సినీనటుడు రాజా సంతాపం తెలిపారు.