రేషన్ కార్డుదారులకు మంత్రి అదిరిపోయే శుభవార్త..
హైదరాబాద్ మార్చి 26(ప్రజాక్షేత్రం):తెలంగాణ రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు ఇకపైన పూర్తి స్థాయిలో అందిస్తామని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. చౌక ధరల దుకాణాల్లో ఇకనుంచి రేషన్ బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. లబ్ధిదారులు ఇకపైన రేషన్ షాపుల్లో నిత్యవసర సరుకులు తీసుకువెళ్లాలని కోరారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కూడా పంపిణీ చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై కూడా కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించారు. మిగిలిన డెడ్ బాడీలను త్వరలోనే బయటకు రెస్క్యూ టీం తీసుకువస్తుందని తెలిపారు. సహాయక చర్యలు పూర్తికాగానే ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.