Praja Kshetram
తెలంగాణ

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

 

హైదరాబాద్‌ మార్చి 26(ప్రజాక్షేత్రం):ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లు తిలకించే క్రికెట్‌ అభిమానుల కోసం టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్‌ సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియానికి వచ్చేందుకు గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేయనుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్న తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉప్పల్ స్టేడియంలో మార్చ్ 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Related posts