Praja Kshetram
క్రైమ్ న్యూస్

పుట్టినరోజు నాడే.. చివరి రోజు..

పుట్టినరోజు నాడే.. చివరి రోజు..

 

– పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం.

– హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం.?

పెద్దపల్లి బ్యూరో, మార్చి 28(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది.సాయి కుమార్ అనే యువకుడు స్నేహితులతో కలసి ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎలిగేడు మండలం ముప్పిరితోటలో గురువారం రాత్రి గొడ్డలితో దారుణంగా హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ల పరశురాములు,జోష్ణ దంపతులకు కుమారుడు సాయికుమార్, కూతురు ఉన్నారు. అయితే గత 5 సంవత్సరాల కిందట కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. సాయికుమార్ రాత్రి తన స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకలను చేసుకుంటున్న క్రమంలో ఒక్క సరిగా గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై అరా తీశారు. అనంతరం ఘటన స్థలాన్ని పెద్దపల్లి డీఎస్ పీ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts