సీసీ రోడ్డు పనులు ప్రారంభం
– గ్రామాల అభివృద్దే లక్ష్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
– టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్.
నాంపల్లి మార్చి 28(ప్రజాక్షేత్రం):రేవల్లీ గ్రామపంచాయతీలో నూతనంగా సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ యాదవ్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంగా కారణంగా వెనుకబడిన మునుగోడు నియోజకవర్గం లో గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్డుల నిర్మాణం, నిటి కొరత లేకుండా బోర్లు వేయిస్తూ నియోజక వర్గ మహిళల కొరిక మేరకు మద్యపాన నిషేధం చేస్తూ పెదలకు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు వంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ అణునిత్య నీయోజక వర్గ అభివృద్ధికి తోడ్పడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు మాజీ సర్పంచ్ కొన్రెడ్డి వెంకటయ్య జరుగుతున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్డును వేయాలని వారు అధికారులకు తెలియజేశారు. మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి చంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సీసీ రోడ్డును మంజూరు చేసిందని తెలిపారు. మునుగోడు శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని చెప్పారు. వారి సహకారంతో రేవల్లి గ్రామపంచాయతీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బట్టు శ్రీను యాదవ్, సైదులు, ఏటెల్లి గిరి, కషిపాక మధు, కొన్రెడ్డ్ లింగయ్య, కృష్ణయ్య, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.