Praja Kshetram
తెలంగాణ

నిజామాబాద్ జిల్లాలో గంజాయి కలకలం.

నిజామాబాద్ జిల్లాలో గంజాయి కలకలం.

 

– గంజాయి వాడుతున్న యువకులను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న విలేకరులు.

– గంజాయి చేయిస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టివేత.

– గుత్ప గ్రామం సమీపంలో గంజాయి సేవిస్తున్న యువకులు.

– రోజు రోజుకు పెరుగుతున్న గంజాయిల ముఠా.

– గంజాయిని పట్టుకుందాం యువతను కాపాడుదాం.

నిజామాబాద్, మార్చి 28(ప్రజాక్షేత్రం):ఆలూర్ మండలం పరిధిలోని గుత్ప గ్రామంలో గంజాయి కలకలం రేపింది.అపురూపాలయం సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయిను సేవిస్తుండగా రెడ్ హ్యాండ్ గా స్థానిక విలేకర్లు కొంతమంది యువత గ్రామస్తుల సహాయంతో పట్టుకున్నారు.గ్రామంలో విచారించగా వీరే ఇతరులకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు.మాక్లూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా వారు నిందితుల నుండి మూడు ప్యాకెట్ల గంజాయి ను స్వాధీనం చేసుకున్నారు.వారిని విచారించి నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు వీరిని పట్టుకోవడం జరిగిందని అన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ రోజురోజుకు గంజాయి కి బానిస అవుతున్న యువతకు తగు గుణపాఠం చెప్పాలని పోలీసులను ప్రభుత్వాన్ని కోరారు.

Related posts