ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్
– లౌకిక వాదం మన జన్మ హక్కు
– మత సమరస్యానికి ప్రతీక ఇఫ్తార్
– హిందూ ముస్లిం భాయ్ భాయ్
నర్సంపేట, మార్చి 28 (ప్రజాక్షేత్రం):నర్సంపేట పట్టణంలోని 22 వ డివిజన్ లో తాజ్ కుర్సీదా మసీదులో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రార్థనలు చేసి ముస్లింలకు నర్సంపేట మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ముస్లిం మత పెద్దలకు పండ్లు తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినారు.ఈ సందర్భంగా వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ భారతదేశం లౌకిక దేశమని లౌకికవాదం మన జన్మ హక్కు అని, హిందూ ముస్లిం భాయి భాయి గా ఎప్పుడు కలిసి ఉండాలని, ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు, అల్లాదయ ప్రజలందరి పైన ఉండి,సుఖ సంతోషాలతో శాంతియుత మార్గంలో ప్రజలంతా కలిసి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దండెం రతన్ కుమార్,ఎన్ ఎస్ యు ఐ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్, 22వ డివిజన్ కార్యదర్శి తోగరు దేవేందర్,జిజుల కార్తీక్, మైనార్టీ నాయకులు ఎండి ఆఫీస్, ఎండి జలీల్,ఎండి అఖిల్ పాషా,ఎండి ఖలీల్, ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు.