డఫోడిల్స్ సి.బి.ఎస్.ఈ పాఠశాలలో ఘనంగా ఇఫ్తార్ విందు.
– ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని చాటి చెప్పిన డఫోడిల్స్.
– పాఠశాల అధినేత చింతల నరెందర్.
నర్సంపేట మార్చి 28(ప్రజాక్షేత్రం):పాఠశాలలో ఇఫ్తార్ విందు తో పాటు పేద పిల్లల మదర్స లకు ఆర్థిక సహాయం అందజేత
మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం డఫోడిల్స్ పాఠశాల యాజమాన్యం గొప్పదనం అని ముస్లీమ్ మత పెద్దల అభినందనలు మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని డఫోడిల్స్ (సి.బి.ఎస్.ఈ ) పాఠశాల కరస్పాండెంట్ చింతల నరెందర్ అన్నారు. శుక్రవారం నర్సంపేట పట్టణానికి చెందిన డఫోడిల్స్ (సి.బి.యస్.ఈ) పాఠశాలలో కరస్పాండెంట్ చింతల నరెందర్ ఆధ్వర్యంలో పాఠశాల లోని విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు ముస్లీమ్ మత పెద్దలకు ఇఫ్తార్ విందు, రంజాన్ తోఫలని ను అందజేసి ఇఫ్తార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ముస్లీమ్ మత పెద్దలతో పాఠశాలలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఈ సందర్బంగా పాఠశాల కరస్పాండెంట్ చింతల నరెందర్ ముందస్తుగా అందరికి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ…ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగల్లో రంజాన్ ప్రముఖమైనదన్నారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని అభివర్ణించారు. ఈ పవిత్ర మాసం ఉపవాస దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతాయని ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. రంజాన్ మాసం మతసామారాస్యానికి ప్రతికగా నిలుస్తుందన్నారు. ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది, ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ భిన్నత్వం లో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మనదేశంలో కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులను ఇవ్వడం ఔన్నత్వానికి నిదర్శనమన్నారు. ముస్లింలంతా ఆనందోత్సహాలతో రంజాన్ పండు గను జరుపుకోవాలని కోరుతూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం డఫోడిల్స్ పాఠశాల యాజమాన్యం గొప్పదనం అని పాఠశాల కరస్పాండెంట్ చింతల నరెందర్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన రోహిత్, ప్రధానోపాద్యాయులు అజీముద్దీన్, ఉప ప్రధానోపాధ్యాయులు సి. హెచ్ రీటా, హెచ్. ఆర్. డి విజయలక్ష్మి, శశికల, ఉపాధ్యాయ బృందం, ముస్లీమ్ మత పెద్దలు అబ్దుల్లా, నొమన్, రబ్బానీ, జావీద్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.