Praja Kshetram
తెలంగాణ

మెడికల్ షాపుల్లో అంతలేని అవినీతి

మెడికల్ షాపుల్లో అంతలేని అవినీతి

 

 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 30(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా పరిధిలోని మెడికల్ షాపుల్లో అంతులేని అవినీతి చోటు చేసు చేసుకుంది. దీంతో మెడికల్ షాప్ యజమానులు, రెండు చేతులు సంపాదిస్తున్నారు, ఎమ్మార్పీ రేట్ కన్నా ప్రజల వద్ద డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నప్పటికీ, ఈ మెడికల్ షాపులపై పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలు తీవ్రంగా మెడికల్ షాప్ లా యాజమాన్యాలపై ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. ఒక పారాసెటమాల్ టాబ్లెట్, మూడు రూపాయలకు డోలో టాబ్లెట్, నాలుగు నాలుగు, రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు మెడికల్ షాప్ లో యజమానులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముసలి వారి నుండి చిన్న పెద్ద తేడా లేకుండా డాక్టర్ల కన్సల్ట్ ఉండడం వల్ల డాక్టర్ రోగానికి సంబంధించిన టాబ్లెట్ పేద ప్రజలను మెడికల్ షాప్ యజమానులు చాలా మోసలకు గురి చేస్తున్నారని వారిపై మండిపడుతున్నారు. అసలు వీరు మెడికల్ షాప్ లపై పర్యవేక్షణ లేదా, ఉంటే ఈ విధంగా డబ్బులు ఎందుకు వసూలు చేస్తారని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మెడికల్ షాపులు యజమానులు విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ వీరిపై పర్యవేక్షణ తక్షణమే చర్యలు తీసుకోవాలని మారుమూల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Related posts