Praja Kshetram
తెలంగాణ

400 ఎకరాల భూమిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీలక ప్రకటన.

400 ఎకరాల భూమిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీలక ప్రకటన.

 

– కంచ గచ్చిబౌలిలోని భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ ప్రకటన.

– టీజీఐఐసీ ప్రకటనను ఖండించిన హెచ్‌యూసీ.

– ఇప్పటి వరకు భూమికి సరిహద్దులు గుర్తించలేదన్న సెంట్రల్ యూనివర్సిటీ.

హైదరాబాద్ మార్చి 31(ప్రజాక్షేత్రం):కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తమదేనని టీజీఐఐసీ చేసిన ప్రకటనపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్పందించింది. టీజీఐఐసీ ప్రకటనను హెచ్‌సీయూ ఖండించింది. ఈ మేరకు హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 జులైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందన్న దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని ఆ ప్రకటనలో తెలిపారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు భూమికి సరిహద్దులు గుర్తించలేదని, దీనిపై హెచ్‌సీయూకి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆ భూమిని విశ్వవిద్యాలయానికే ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నామని, భూమి కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు.

Related posts