పేరుకే సెంట్రల్ లైటింగ్స్.. పర్ఫామెన్స్ లో జీరో లైటింగ్..
శంకర్ పల్లి మార్చి 31(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ ఫ్లైఓవర్ పై సెంట్రల్ లైటింగ్స్ గత కొన్ని రోజులుగా వెలగడం లేదు. ఫత్తేపూర్ నుండి రామంతపూర్ వరకు సుమారు కిలోమీటర్ల దారి పొడువునా లైట్స్ పరిస్థితి ఇలానే ఉండటంతో రాత్రి సమయాల్లో వాహనదారులు, పాదచారులకు, దుకాణదారులకు ఇబ్బందిగా మారింది. చీకటి కారణంగా యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే మున్సిపల్ అని పలువురు వాహనదారులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరారు.