మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమారి జన్మదిన వేడుకలు.
– ఢిల్లీకి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన భీమ్ భారత్.
చేవెళ్ల మార్చి 31(ప్రజాక్షేత్రం): సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమారి జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిన పలువురు నేతలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఢిల్లీలోని మాజీ స్పీకర్ మీరా కుమారి నివాసంలో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన భీమ్ భారత్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.