ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపినా మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ మార్చి 31(ప్రజాక్షేత్రం):బిఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు, ముస్లిం మేధావి సయ్యద్ ఇస్మాయిల్ రంజాన్ పండుగను పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ని తమ ఇంటికి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సంప్రదాయలతో విందును ఏర్పాటు చేయడం జరిగింది. మంద కృష్ణ మాదిగ ఇస్మాయిల్ కుటుంబానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇంటికి విచ్చేసిన మంద కృష్ణ మాదిగ కి మరియు సామాజిక ఉద్యమకారులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పృథ్వీ రాజ్ యాదవ్, తెలంగాణ విఠల్, పుల్లా శ్రీనివాస్, దరువు ఎల్లన్న, పాటమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.