పేదలకు సన్న బియ్యం పంపిణి సంతోషం:కొట్టం నర్సింహారెడ్డి
మొయినాబాద్ ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం):ఉగాది పండుగను పురస్కరించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషమని చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొట్టం నర్సింహారెడ్డి కొనియాడారు.నేటి నుంచి ప్రతి రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యాన్ని ఆహార భద్రత కార్డుదారులకు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండలాధ్యక్షుడు తమ్మలి మాణయ్య,గ్రామాధ్యక్షుడు మహేందర్ ఉపాధ్యక్షుడు మల్లేష్ రేషన్ డీలర్ గోటికే శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులున్నారు.