Praja Kshetram
జాతీయం

ప్రేమకథలో అనూహ్య మలుపు- కోడలిని మొదటి భర్త దగ్గరికి పంపిన కొత్త అత్తగారు!

ప్రేమకథలో అనూహ్య మలుపు- కోడలిని మొదటి భర్త దగ్గరికి పంపిన కొత్త అత్తగారు!

 

 

నేషనల్ బ్యూరో ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం):ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్ గ్రామంలో వెలుగుచూసిన షాకింగ్ ప్రేమకథ అనూహ్య మలుపు తిరిగింది. తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్‌తో ఇటీవలే బబ్లూ పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లూ తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు. అయితే రాధికకు రెండో భర్త వికాస్‌ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. రాధికకు రెండో పెళ్లి చేశాక, తన వల్ల ఆమెకు పుట్టిన ఇద్దరు పిల్లల పెంపకం బాధ్యతలను బబ్లూయే తీసుకున్నాడు. రాధిక తన ఇద్దరు పిల్లలను బబ్లూ వద్దే వదిలేసి రెండో భర్త వికాస్‌తో వెళ్లిపోయింది.

– రాధిక భర్త, పిల్లల క్షోభ గురించి ఆలోచించి!

“రాధిక భర్త, అతడి పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి, నేను చలించిపోయాను. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపొమ్మని రాధికకు తేల్చి చెప్పాను” అని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్‌జాట్ గ్రామంలో మళ్లీ పంచాయతీ జరిగింది. బబ్లూ తన భార్య రాధికను చూసుకుంటాడని గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకు ఏదైనా ప్రమాదం జరిగితే, దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి అంతటా చర్చ జరుగుతోంది.

Related posts