ఎల్‌ఆర్‌ఎస్ వివరాలు వెల్లడించిన అధికారులు.
-ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.
-ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వెయ్యి కోట్లు దాటిన ఆదాయం
హైదరాబాద్ ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం):లే అవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు సోమవారం ముగిసింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలను అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తులకు చెందిన భూములను రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్లు ఆదాయం వచ్చినట్లు మున్సిపల్ శాఖ వెల్లడించింది. మొత్తం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, ఇప్పటి వరకు పరిష్కారమైన దరఖాస్తులు తదితర వివరాలు తెలియచేసింది.
రాష్ట్రంలోని 154 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 15,27,859 ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తులు ఉండగా వాటిలో 15,894 ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తులను వివిధ కారణాలతో ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇప్పటికే 6,87,428 ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తులు ప్రాసెస్ అయ్యినట్లు తెలిపింది. ఇప్పటికీ 8,65,601ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు ఫీ చెల్లించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు కేవలం 2,06,560 మాత్రమేనని వెల్లడించింది. అదే విధంగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేసి 58,032 మందికి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినట్లు వివరించింది.
తిరస్కరణకు గురైన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు : 15,894
ప్రాసెస్ అయిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు : 6.87 లక్షలు
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు పెండింగ్ ఉన్న దరఖాస్తులు : 8.65 లక్షలు
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తులు : 2.6 లక్షలు
ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు : 58,032