Praja Kshetram
తెలంగాణ

నాగుపాములతో సహవాసం చేస్తున్న పోలీసులు..

నాగుపాములతో సహవాసం చేస్తున్న పోలీసులు..

 

 

మద్దూరు ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం): ప్రజల రక్షణ కొరకు అనునిత్యం పాటుపడే పోలీసులకు పాములతో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దూరు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తు క్వార్టర్స్ లో ఉండే పోలీసులకు అనునిత్యం విషసర్పాలు ఇండ్లలోకి వస్తుండడంతో భయం భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. మంగళవారం స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కుందారం వెంకటేష్ ఇంటి ముందర నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టుతుండడంతో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రోడ్డున వెళ్లే వాహనదారులు వచ్చి పామును చంపడంతో ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా చాలాసార్లు పాములు వచ్చాయని, అనునిత్యం భయం భయంతో ఉంటున్నామని తెలిపారు.

Related posts