Praja Kshetram
తెలంగాణ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొత్తగడి రెసిడెన్షియల్ స్కూల్..

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొత్తగడి రెసిడెన్షియల్ స్కూల్..

 

 

వికారాబాద్ ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒకప్పుడు విద్య, క్రీడల పట్ల మంచి పేరు తెచ్చుకున్న ఈ పాఠశాల, ప్రిన్సిపాల్ గా సాయిలత టీచర్ వచ్చినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అని చెప్పాలి. ఆమధ్య ఈ పాఠశాలలో చదివే ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో సంచలనం అయింది. ఆ తర్వాత ఒకేసారి పాఠశాల విద్యార్థులందరికీ జాండీస్ రావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ పాఠశాల పేరు చర్చనీయాంశం అయింది. ఇంత జరిగినా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతోనే ఈ పాఠశాలలో ప్రిన్సిపల్ తో పాటు వైస్ ప్రిన్సిపాల్ నియంతలా గా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే 10వ తరగతికి చెందిన తబిత అనే విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఇద్దరు కూడా నన్ను అవమానించారనే మనస్థాపంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అదృష్టం కొద్దీ ఆ విద్యార్థిని కాళ్లకు గాయాలతో బయటపడింది. ఇంత జరిగినా పాఠశాల ప్రిన్సిపాల్ సాయిలత తీరులో ఎలాంటి మార్పు రావడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

– విద్యార్థులపై ప్రిన్సిపాల్ సాయి లత బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

ఈమధ్య ముగ్గురు విద్యార్థులు ఎలాంటి అనుమతి లేకుండా గేటు దాటి బయటకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ప్రిన్సిపాల్ ఆ ముగ్గురిని తన స్టాప్ రూమ్ కి పిలిచి బూతు పురాణం మొదలు పెట్టింది. తనకు ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ.. వారిని వారి కుటుంబాన్ని చిన్నచూపు చేసేలా మాట్లాడడంతో విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరు పొలాల్లో కలవడానికి తప్ప దేనికి పనికి రారని, మీకు చదువు వస్తుంది అనుకోవడం మీ భ్రమ అంటూ వారి పెంపకం పట్ల తల్లిదండ్రులను సైతం దూషించారు. మీ తల్లిదండ్రులకు సిగ్గు శరం లేదు అనేలా బూతులు మాట్లాడడంతో విద్యార్థులకు కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలో నాగర్ కర్నూల్ జిల్లా, తెల్కపల్లి గురుకుల పాఠశాలలో పనిచేసిన ప్రిన్సిపాల్ సాయిలత అక్కడ కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారని తెలుస్తుంది. ఆతరువాత పనిష్మెంట్ కింద అందోల్ అక్కడి నుంచి కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇంత జరిగినా ప్రిన్సిపల్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. చదువు చెప్పాల్సిన పిల్లల జీవితాలతో ఆడుకుంటూ వారు ఆత్మహత్య చేసుకునేలా ఒక డిక్టేటర్ టార్చర్ చేస్తుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన తప్పులను విద్యార్థులు బయటకు చెప్పాలని చూస్తే టీసీ ఇచ్చి పంపిస్తాను అంటూ బెదిరిస్తున్న పరిస్థితి. దాంతో విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాక నరకయాతన అనుభవిస్తున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించి తన పై సస్పెన్షన్ వేటు వేసి మా పిల్లల జీవితాలను కాపాడాలని కోరుతున్నారు.

Related posts