కొండాపూర్ నూతన తాసిల్దార్ గా బి.అశోక్.
కొండాపూర్ ఏప్రిల్ 3 (ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లాలో 17 మంది తాసిల్దారు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు కొండాపూర్ తాసిల్దారుగా విధులు నిర్వహించిన ఏ. అనితను వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరులో అవకతవకలకు చేసినందున జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆగ్రహం వ్యక్తం చేసి నారాయణఖేడ్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కొండాపూర్ నూతన తాసిల్దారుగా బి. అశోక్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.