ఒక్క మందుతో గుండెపోటు, స్ట్రోక్ దూరం!
హైదరాబాద్ ఏప్రిల్ 03(ప్రజాక్షేత్రం):గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించగల ‘లెపొడిజిరాన్’ మెడిసినన్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని అమెరికాకు చెందిన ఎలి లిల్లీ అనే ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది. ఏడాదికి ఒక్కసారి వేసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 94శాతం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా ఈ పరిశోధనలో 6 నెలల పాటు దీని ప్రభావం ఉన్నప్పటికీ, దుష్ప్రభావాలు కనిపించలేదు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.